ఆంధ్రప్రదేశ్

ఉద్యమ కార్యాచరణపై అమరావతి జేఏసీ భేటీ

రాజకీయ, ప్రజా, కుల సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది అమరావతి జేఏసీ. ఇన్నాళ్లుగా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా ప్రభుత్వంలో..

ఉద్యమ కార్యాచరణపై అమరావతి జేఏసీ భేటీ
X

రాజకీయ, ప్రజా, కుల సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది అమరావతి జేఏసీ. ఇన్నాళ్లుగా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా 3వందల రోజులకు చేరుకుంటున్న ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే ఆది, సోమ వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరనస ప్రదర్శనలు చేపడుతామన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story

RELATED STORIES