బుక్కరాయసముద్రంలో..వైసీపీ నేతల మధ్య వార్‌..

బుక్కరాయసముద్రంలో..వైసీపీ నేతల మధ్య వార్‌..
వెంకటాపురంలో ఉన్న బీరప్ప గుడి వ్యవహారం వైసీపీ నేతల మధ్య వార్‌కి కారణం అయ్యింది. స్థానిక వైసీపీ నేతలు వర్సెస్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌గా మారింది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వైసీపీలో పొలిటికల్ హాట్‌ పెరిగింది. వెంకటాపురంలో ఉన్న బీరప్ప గుడి వ్యవహారం వైసీపీ నేతల మధ్య వార్‌కి కారణం అయ్యింది. స్థానిక వైసీపీ నేతలు వర్సెస్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌గా మారింది. ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. సొంతవర్గం నేతల పోరుతో వైసీపీకి రివర్స్‌ పంచ్‌ తగిలినట్లు అయ్యింది.

టీడీపీ హయాంలో వెంకటాపురంలో బీరప్ప గుడి నిర్మాణం కోసం కమిటీ హాల్‌ నిర్మించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కమిటీ హాల్‌పై వివాదం చెలరేగింది. బీరప్ప గుడి కోసమే కమిటీ హాల్‌ నిర్మించారని ఓ వర్గం అంటుంటే.. మహిళా సంఘాల కోసం నిర్మించారంటూ మరోవర్గం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ వరకు వెళ్లింది టెంపుల్ వ్యవహారం. ఇక వివాదం పెద్దది అవడంతో కమిటీ హాల్‌కు తాళం వేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక వైసీపీ నేతలు తాళాలు వేశారు. కమిటీ హాల్‌కు తాళాలు పడటంతో వైసీపీలో చీలక వచ్చింది.

తమ సామాజికవర్గానికి చెందిన గుడికి తాళం వేస్తారా అంటూ ఎంపీ మాధవ్‌ రంగంలోకి దిగారు. వెంకటాపురంలోని కమిటీ హాల్‌ ముందు కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం టెంపుల్‌ తాళాలు తీసి.. బీరప్ప ఆలయంలో పూజలు చేశారు. దీంతో స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని తాళాలు ఏలా తీస్తారని ఎంపీపై మండిపడుతున్నారు. మాధవ్‌ తాళాలు ఓపెన్ చేయడంతో సింగనమల వైసీపీ నేతలు, ఎంపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. టెంపుల్ విషయంలో కొంత మంది కావాలనే విద్వేశాలు రెచ్చగొడుతున్నారని మాధవ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story