Andhra Pradesh: నూతన గవర్నర్‌గా సుప్రీం మాజీ న్యాయమూర్తి

Andhra Pradesh: నూతన గవర్నర్‌గా సుప్రీం మాజీ న్యాయమూర్తి
అబ్దుల్‌ నజీర్‌ను గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్‌ నజీర్‌ నియామకమయ్యారు. అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుతం ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌ గఢ్‌ గవర్నర్‌గా బదిలీ చేశారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిశ్వభూషణ్‌ను 2019 జూలై 17 ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. ఆయన దాదపు మూడున్నర ఏండ్లు ఏపీ గవర్నర్‌గా సేవలందించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్‌ నజీర్‌ గత నెల జనవరి 4న పదవీ విరమణ చేశారు. వివాదస్పద బాబ్రీ మసీద్‌ కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో అబ్దుల్ నజీర్‌ సభ్యుడవడం గమనార్హం. అంతే కాకుండా త్రిపుల్‌ తలాఖ్‌ కేసును విచారించిన ధర్మాసనంలోను ఆయన సభ్యుడిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story