ట్విట్టర్ లో జార్ఖండ్ సీఎం, ఏపీ సీఎం మధ్య ఆసక్తికరమైన సంభాషణ..!

ట్విట్టర్ లో జార్ఖండ్ సీఎం, ఏపీ సీఎం మధ్య ఆసక్తికరమైన సంభాషణ..!
కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలకి ఫోన్ చేశారు.

కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలకి ఫోన్ చేశారు. అయితే ఫోన్ సంభాషణ తరవాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారని.. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేదంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ప్రధాని మోదీ పైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం తప్పుబట్టారు. కరోనా పై పోరాటంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉండాలని జగన్ పిలుపినిచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తే దేశం బలహీనం అవుతుందని అన్నారు. సీఎం హేమంత్ సోరెన్ అంటే తనకి ఎంతో గౌరవమని అన్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ కౌంటర్ వేశారు. కాంగ్రెస్ దిగ్గజ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు.. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. CBI,ED కేసులకి భయపడి ప్రధాని మోదీతో రాసుకుపూసుకు తిరగడం సరికాదని అన్నారు. జగన్ ఎదగాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అనే విషయాన్నీ గుర్తుంచుకోవాలని విమర్శలు చేశారాయన.


Tags

Read MoreRead Less
Next Story