AP Group 2 Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల

AP Group 2 Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్,  గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల
ముఖ్య తేదీలివే..

ఎట్టకేలకు గ్రూప్‌2 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న సమయంలో నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్‌ 1తోపాటు..ఇతర శాఖల్లో ఖాలీలపై ఏపీపీఎస్సీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 జూన్‌లో జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రకటించిన గ్రూపు2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ వెలువడేందుకు రెండేళ్ల 5 నెలల సమయం పట్టింది. కాలయాపన వల్ల.... 50వేల మంది వరకు వయోపరిమితి కోల్పోయి ఉంటారని అంచనా. ప్రభుత్వశాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నవంబరు 1న ఏపీపీఎస్సీ వెల్లడించింది. కానీ, గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 897 పోస్టులే ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్‌ తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్‌ జరుగుతుందన్నమాట. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఇవన్నీ జరిగి.. ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు చాలా సమయమే పడుతుంది.

నోటిఫికేషన్‌ కింద ప్రకటించిన పోస్టులు ఇప్పటికిప్పుడు గాలిలో నుంచి కొత్తగా సృష్టించలేదు. ప్రభుత్వం వద్ద ఖాళీల జాబితా సిద్ధంగా ఉన్నా....భర్తీ చేయడం ఇష్టం లేక ఇన్నాళ్లు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసింది. మరోపక్క.. పోస్టుల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పాయింట్స్‌, పే స్కేలు వివరాలు నోటిఫికేషన్‌లో లేవు. గ్రూపు-1తో పాటు..ఇతర శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్న ఏపీపీఎస్సీ గురువారం కేవలం గ్రూపు-2 మాత్రమే జారీచేసింది. మిగిలిన నోటిఫికేషన్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 331, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 566 ఉన్నాయి. గ్రూపు-2 నోటిఫికేషన్‌ అనుసరించి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 21 నుంచి స్వీకరిస్తారు. జనవరి 10 వరకు స్వీకరణ జరుగుతుంది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story