AndhraPradesh: సభకో నమస్కారం: తుగ్లక్ పాలనలో ఇంతే మరి....

Andhrapradesh
AndhraPradesh: సభకో నమస్కారం: తుగ్లక్ పాలనలో ఇంతే మరి....
జీవో నెం.1పై తారాస్థాయిలో విమర్శలు; అప్రజాస్వామిక జీవోపై దుమ్మెత్తిపోస్తున్న పౌరులు; తిక్కల రాజు తుగ్లక్ పాలన అంటూ సెటైర్లు...

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలు ఎమెర్జెన్సీ కాలాన్ని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, రోడ్ షోలపై నిషేధాలు విధిస్తూ జీవోను జారీ చేసిన జగన్ ప్రభుత్వ వైఖరిపై జాతీయ మీడియా సైతం దుమ్మెత్తి పోస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు సభలలో పలువురు ప్రాణాలు కోల్పోయారని రోడ్లపై ర్యాలీలు,సభలు, రోడ్ షోలు నిషేధించిన ప్రభుత్వం పిరికిపంద చర్యగానే ఈ జీవోను జారీ చేసినట్లు చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతూనే ఉంది.

తాజాగా కుప్పంలో తేదేపా అధ్యక్షుని ర్యాలీపై జరుగుతున్న హింసాకాండతో యావత్ మీడియా మోతెక్కిపోతోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజానీకం దగ్గర నుంచి పొలిటికల్ ఎక్స్ పర్ట్ ల వరకూ అందరి మదిలోనూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడ జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలపై ప్రతి ఒక్కరిలోనూ రియాక్షన్ మొదలైంది. దీంతో ప్రజల ప్రశ్నలతో సోషల్ మీడియా షేక్ అయిపోతోందనే చెప్పాలి.

జీవో నెం.1 ను దృష్టిలో పెట్టుకుని ఎందరో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ప్రతిరోజూ రోడ్డుపై ఎన్నో యాక్సిడెంట్లు జరిగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని రవాణా వ్యవస్థను నిలిపివేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తుండాగా... ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాల కోల్పోతున్నారు కాబట్టి పరిశ్రమలను కూడా నిలిపివేస్తారా? అని మరికొంత మంది ట్రోల్ చేస్తున్నారు.

ట్రోలర్స్ మాట అటు ఉంచితే.. ప్రతి పౌరుడి మనసులోనూ ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం కల్తీ సారా తాగి మృత్యువాత పడుతున్నవారే వేలల్లో ఉన్నారు. మరి ప్రజల ప్రాణాలపై అంత ప్రేమ ఉన్న జగన్ ప్రభుత్వం తక్షణం మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయడంలేదు.

ఆ మాటకొస్తే భవన నిర్మాణాలలో ప్రమాదాలు జరిగి ఎంత మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడంలేదు. అలా అని నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిలిపివేస్తామా!? ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి బలవుతున్నవారు, విద్యార్ధుల ఆత్మహత్యలు, బస్సు ప్రమాదాలు, బోటు ప్రమాదాలు జరిగి నిత్యం కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలసి పోతున్నాయి. కాబట్టి, వైద్య, విద్య రంగాలతో పాటూ, ఆర్టీసీని కూడా పూర్తిగా నిషేధిస్తారా...! ఏమో తుగ్లక్ పాలనలో గుర్రం ఎగరా వచ్చునేమో అంటారా...!

నిజమే.. ఎన్నికల సమయంలో ప్రభుత్వ సిబ్బందితో పాటూ, ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఎన్నికలను కూడా రద్దు చేసి ఏకంగా ప్రజాస్వామ్యానికే పంగనామాలు పెడతారేమో....! మరి రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవలేదుగా....

Tags

Read MoreRead Less
Next Story