అమరావతిపై కుట్రలకు మరో పెయిడ్‌ బ్యాచ్.. నిలదీసేసరికి షాక్‌

అమరావతిపై కుట్రలకు మరో పెయిడ్‌ బ్యాచ్.. నిలదీసేసరికి షాక్‌
అమరావతిపై అధికార పార్టీ కుట్రలకు అంతం లేకుండా పోతోంది.. ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులతో పోటీ ఉద్యమాన్ని..

అమరావతిపై అధికార పార్టీ కుట్రలకు అంతం లేకుండా పోతోంది.. ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులతో పోటీ ఉద్యమాన్ని నడిపిస్తూ నవ్వులపాలవుతున్నారు.. అమరావతిపై కుట్రలకు మరో పెయిడ్‌ బ్యాచ్‌ దిగింది.. రాజధాని రైతులకు పోటీగా మందడంలో దీక్షా శిబిరం పుట్టుకొచ్చింది.. ఆ దీక్షా శిబిరంలో ఎవరైనా అడిగితే ఎలా చెప్పాలనే దానిపై పెయిడ్‌ ఆర్టిస్టులకు ట్రైనింగ్‌ ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు..

ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో కొంతమంది దీక్షా శిబిరంలోనే ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఏవూరు, ఎక్కడ్నుంచి వచ్చారు అని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో మాదీ ఒక గ్రామం బేతపూడి అని చెప్పాలని సూచిస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారని.. మాకూ అన్యాయం జరుగుతోందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ, అమరావతి గ్రామాల ప్రజలకు తెలియాలనే దీక్షల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు చెప్పాలంటూ శిక్షణ ఇస్తున్నారు.. ఒకవేళ డబ్బులిచ్చి పంపించారా అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఎలా ఆన్సర్‌ ఇవ్వాలో కూడా పక్కాగా ట్రైనింగ్ ఇస్తోంది పెయిడ్‌ బ్యాచ్‌.. మాకెవరూ డబ్బులు ఇవ్వడం లేదు.. స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలంటూ సూచించారు..

ఇప్పటి వరకు కేసులతో, దౌర్జన్యాలతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్టులతో పోటీ ఉద్యమాన్ని నడుపుతోందంటూ రాజధాని ప్రాంత రైతులు ఫైరవుతున్నారు.. అమరావతే రాజధానిగా కొనసాగాలన్న ఏకైక నినాదంతో తాము 312 రోజులుగా ఉద్యమం చేస్తున్న తమపై దిగజారి వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని నిలదీస్తున్నారు.. తాము ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు పెయిడ్ బ్యాచ్‌ అని వాళ్లంతన వాళ్లే ప్రూప్‌ చేసుకున్నారని అంటున్నారు. అమరావతిని సమాధి చేయడానికి ముఖ్యమంత్రే సిద్ధమవడం దుర్మార్గమంటున్నారు రాజధాని ప్రాంత మహిళలు.

నిన్నటికి నిన్న రాజధాని వికేంద్రీకరణ పేరుతో పెయిడ్‌ ఆర్టిస్టులతో నకిలీ ఉద్యమాన్ని నడిపేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు కొంతమంది అధికార పార్టీ నేతలు. మంగళగిరి సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందర్నీ ఆటోల్లో ఎక్కించుకుని మరీ రాజధాని ప్రాంతానికి తీసుకుని వచ్చి ధర్నాలు చేయిస్తూ దొరికిపోయారు. ఇందులో భాగంగా కృష్ణరాయుని పాలెంలో కొందర్ని అడ్డుకున్నారు స్థానిక దళితులు.. పెనుమాక, కృష్ణాయపాలెం మధ్య 15 ఆటోల్ని ఆపిన స్థానిక దళితులు, ఆటోల్లో వచ్చిన వారిని నిలదీశారు. ఆటోల్లో ఉన్నవారిని రాజధానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో తత్తరపడిన పెయిడ్‌ ఆర్టిస్టులు.. తాము కూడా లోకల్ వాళ్లమేనని బుకాయించే ప్రయత్నం చేశారు. ఐతే, ఆధార్ కార్డులు చూపించండి అంటూ నిలదీసేసరికి షాక్‌ అయ్యి ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. స్థానిక YCP ప్రజాప్రతినిధే వీరందరినీ నకిలీ ఉద్యమం చేసేందుకు తీసుకువెళ్తున్నారంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story