AP:రాజధానిపై సీఎం ప్రకటన న్యాయవ్యవస్థకు భంగం

AP:రాజధానిపై సీఎం ప్రకటన న్యాయవ్యవస్థకు భంగం
రాష్ట్ర రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నామంటూ ఏపీ సీఎం జగన్మోహన్ చేసిన ప్రకటనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నామంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తి సొలిసిటర్‌ జనరల్ ఆఫ్‌ ఇండియాని నివేదించారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ రాసిన లేఖపై అటార్నీ జనరల్ వెంకట రమణి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పలు కేసుల్లో తాను వాదించానని దీంతో ఈ అంశంపై తాను నిర్ణయం తీసుకోలేనని అటర్నీ జనరల్‌ అన్నారు. దీంతో ఈ విజ్ఞప్తిని సొలిసిటర్ జనరల్ పరిశీలనకు పంపారు. ఈ విషయాన్ని జడ శ్రవణ్‌కుమార్‌కు తెలిపారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటంచారు. కేసు సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉండంగా సీఎం ఇలాంటి ప్రకటన చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించడమే జడ శ్రవణ్ కుమార్‌ అటార్నీ జనరల్‌,సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళారు. ఇలాంటి ప్రకటనలు పదే పదే చేయటం సుప్రీంకోర్టును ప్రభావితం చేయడమేనని శ్రావణ్ కుమార్ లేఖలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story