AP: అనంతపురంలో హై డ్రామా

AP: అనంతపురంలో హై డ్రామా
కడప ఆర్జేడి ప్రతాపరెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం

అనంతపురంలో హై డ్రామా నెలకొంది. స్థానిక ఆర్ డి డి స్టేడియంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థి సంఘాల నాయకులకు కడప ఆర్జేడి ప్రతాపరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీక్రెట్‌గా అర్ధరాత్రి టీచర్స్‌ యూనియన్‌లతో సమావేశం వెనుక ఉద్దేశం ఏంటని స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు నిలదీశాయి. అయితే ఊహించని పరిణామంతో అలెర్ట్ అయిన ఆర్జేడి ప్రతాపరెడ్డి డైవర్ట్ చేయడం కోసం తనను మర్డర్ చేయడానికి వచ్చారని పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్టేడియంకు చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను రాప్తాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అయితే అర్ధరాత్రి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, అధికారులు, సంఘాల నాయకులతో రహస్య సమావేశం కేవలం పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి గెలిపించేందుకేనని.. అధికార పార్టీకి అనుకూలంగా ఆర్జేడి సీక్రెట్‌ మీటింగ్స్‌ నిర్వహస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ హోదాలో ప్రతాపరెడ్డి స్టేజి పైకెక్కి హెచ్ఎం లను, ఎం.ఈ.ఓ లను ఉద్దేశించి మాట్లాడాలి కానీ ప్రతాపరెడ్డి అలా చేయకపోగా. టీచర్స్‌ చుట్టూ తిరుగుతూ వారితో ఆలింగనాలు,సెల్ఫీలు తీసుకుంటూ హల్‌చల్‌ చేశాడు.కేవలం ప్రచారం కోసం సభను నిర్వహించినట్టుగా STU నాయకులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఆర్జేడి ప్రతాపరెడ్డి పై పలు ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి వైసీపీ మద్దతిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డికి ప్రత్యక్షంగా సహకరిస్తూ 300 మంది టీచర్స్‌తో సమావేశం నిర్వహించారని, విద్యాశాఖ సమావేశం పేరుతో నిర్వహించినా ఇది కేవలం ఉపాధ్యాయులను ప్రభావితం చేసేందుకేనని విపక్షాలు అంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఇబ్బందులు ఉంటాయని ఫోన్లలలో బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రతాపరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story