AP: సత్ఫలితాలనిస్తున్న మెడికల్ డిస్ట్రిక్ట్ రెసిడెన్సి ప్రోగ్రాం

AP: సత్ఫలితాలనిస్తున్న మెడికల్ డిస్ట్రిక్ట్  రెసిడెన్సి ప్రోగ్రాం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 400మంది పీజీ వైద్య విద్యార్ధులు సేవలందిస్తున్నారు

నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలతో అమలవుతున్నడిస్ట్రిక్ట్ రెసిడెన్సి ప్రోగ్రాం సత్ఫలితాలనిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 400మంది పీజీ వైద్య విద్యార్ధులు సేవలందిస్తున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థులు కాకినాడ, తుని, రౌతులపూడి, తాళ్ళరేవు తదితర ఆసుపత్రిలలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మిగిలిన రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థులు అమలాపురం, రాజమహేంద్రవరం , అనపర్తి లతో పాటు ఆయా ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. పీజీ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అటు వైద్య సిబ్బంది కొరత లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహద పడుతుందన్నారు. ఈ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం లో పీజీ విద్యార్థులకు ఎకామిడేషన్‌తో పాటు పలు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలని, సమస్యల్ను పరిష్కరించాలని కోరుతున్నారు వైద్య విద్యార్ధులు.

Tags

Read MoreRead Less
Next Story