AP: టీచర్లకు సెలవుల్లేవ్‌

AP: టీచర్లకు సెలవుల్లేవ్‌
ఏపీలో టీచర్ల సెలవులకు జగన్‌ సర్కార్‌ నో చెప్పేసింది. దీంతో ఇప్పటివరకూ వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా ఉన్న టీచర్లు ఇప్పుడు నాన్‌-వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా మారిపోనున్నారు

ఏపీలో టీచర్ల సెలవులకు జగన్‌ సర్కార్‌ నో చెప్పేసింది. దీంతో ఇప్పటివరకూ వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా ఉన్న టీచర్లు ఇప్పుడు నాన్‌-వెకేషన్‌ ఎంప్లాయిస్‌గా మారిపోనున్నారు. అయితే ప్రభుత్వంలో ఎవరికి లేని ప్రత్యేక వెసులుబాటు టీచర్లకు ఉంది.వేసవి సెలవులు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే వారికి ఎర్నింగ్‌ లీవ్స్‌ ఆరు మాత్రమే ఉంటాయి. మిగతా ఉద్యోగులకు దాదాపు 30 వరకు ఎర్నింగ్‌ లీవ్స్‌ ఉంటాయి. అయితే వారికి ఈ సమ్మర్‌ హాలీడేస్‌లో అనేక పనులు అప్పగిస్తూ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. అయితే ఇందుకోసం టీచర్లు స్కూళ్లకు రావాలా వద్దా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ టాస్క్‌లను మాత్రం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక ప్రభుత్వం ఈ చర్యలపై చిత్రమైన వివరణ ఇస్తోంది. హాలీడేస్‌ కేవలం స్టూడెంట్లకు మాత్రమే కానీ టీచర్లకు కాదని వాదిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు విద్యార్థుల తోపాటు టీచర్లకు కూడా సెలవులు ఇస్తారు. హెడ్‌ మాస్టర్‌, రికార్డు అసిస్టెంట్‌లను మాత్రం నాన్‌-వెకేషన్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారు. అందుకే వారికి 30 ఈఎల్స్‌ ఇచ్చి,మిగిలిన టీచర్లకు ఆరు ఇస్తారు. అయితే ఇప్పుడు టీచర్లకు సెలవులు అక్కర్లేదనే వాదన తెరపైకి తెచ్చిందిజగన్‌ సర్కార్‌.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లు మండిపడుతున్నారు.సెలవులను కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు తీసుకుంటే ఈఎల్స్‌ తగ్గిస్తున్నారని, మళ్లీ ఈ కార్యక్రమాలు తమ నెత్తిన పెడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు.తమను కూడా నాన్‌-వెకేషన్‌ ఉద్యోగుల జాబితాలో చేర్చాలని,అందరిలాగే తమకూ 30 ఈఎల్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అటు టీచర్లకు పెద్ద టాస్కే ఇచ్చింది సర్కార్‌ ఒకటి నుంచి పదో తరగతి వరకు టీచర్లందరికీ తరగతుల వారీగా వేర్వేరు పనులు అప్పగించారు. ఒకటో తరగతి విద్యార్థులు ఆకులు,పూలు సేకరించి,వాటిని లెక్కించడం నేర్పించాలని,వివిధ బొమ్మలు గీసేలా చూడాలని ఆదేశించారు. పిల్లల్లో మానవతా విలువలు, క్రియేటివ్‌ స్కిల్‌, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు పెంచేలా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఇలాగే విద్యార్థులకు కొన్ని పదాలు ఇచ్చి వాటిని ఎలా పలకాలో నేర్పించాలని, బొమ్మలు ఇచ్చి రంగులు వేయించాలని, పొడుగు కథలు నేర్పించాలని, చిన్న చిన్న కథలు చెప్పాలని,బొమ్మలతో సామెతలు నేర్పించాలని, ఒక పదం చెప్పిన సంబంధిత అంశాలు చెప్పగలిగేలా మైండ్‌ మ్యాప్‌ రూపొందించేలా ప్రోత్సహించాలని, కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా చూడాలని నిర్దేశించారు.

Tags

Read MoreRead Less
Next Story