హైకోర్టులో ఏపీ రాజధాని అంశంపై విచారణ వాయిదా

హైకోర్టులో ఏపీ రాజధాని అంశంపై విచారణ వాయిదా

హైకోర్టులో ఏపీ రాజధాని అంశంపై విచారణ రేపటికి(మంగళవారం) వాయిదా పడింది. మంగళవారం నుంచి మధ్యంతర పిటిషన్స్‌ను విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన 223 మధ్యంతర పిటీషన్‌ల్లో 189 స్టే కోసం వేసినవే.. దీంతో మిగిలిన 34 పిటీషన్‌లను ముందుగా ధర్మాసనం నిర్ణయించింది.

సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... ప్రభుత్వం గెస్ట్‌ హౌస్‌ పేరుతో పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ల తరుపు న్యాయవాదులు. విశాఖ, కాకినాడ, విజయవాడ, తిరుపతిలో నిర్మాణలు చేస్తోందని గుర్తు చేశారు. అయినా భవన నిర్మాణాల వివరాలు తెలపడం లేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ‌మంగళవారం నుంచి స్టేతో సంబంధం లేని మధ్యంతర పిటీషన్స్‌ విచారిస్తామని వెల్లడించింది.

ప్రత్యేక హోదాకు సంబంధించిన కేసులను కూడా ఫుల్ బెంచ్‌ స్వీకరించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించగా, రైతులు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.

Tags

Read MoreRead Less
Next Story