AP EAMCET మారింది.. ఇక నుంచి EAPCET.. నోటిఫికేషన్..

AP EAMCET మారింది.. ఇక నుంచి EAPCET.. నోటిఫికేషన్..
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 24న విడుదల చేస్తామని దరఖాస్తుల స్వీకరణ 26 నుంచి ఉంటుందని మంత్రి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తన సాధారణ ప్రవేశ పరీక్ష, AP EAMCET పేరును మార్చి EAPCETగా తీసుకువచ్చింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

2021-2022 నుండి, AP EAMCET ను ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) అని పిలుస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 24న విడుదల చేస్తామని దరఖాస్తుల స్వీకరణ 26 నుంచి ఉంటుందని మంత్రి వివరించారు. దరఖాస్తుల స్వీకరణ జులై 25 వరకు ఉంటుందన్నారు. ఆగస్ట్ 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Tags

Read MoreRead Less
Next Story