ఏపీలో స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏపీలో స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం ఆసక్తిని రేపుతోంది.. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు.. అలాగే ప్రభుత్వ వ్యవహారశైలిపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. గవర్నర్‌తో భేటీ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ చీఫ్‌ సెక్రటరీ లేఖ రాయడం దుమారం రేపింది.. అటు సీఎస్‌ లేఖపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కూడా ఘాటుగానే స్పందించారు.. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని మీరెలా ప్రశ్నిస్తారంటూ ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఘాటుగా రిప్లై ఇచ్చారు.. మొత్తంగా ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఏమాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోగా, ప్రభుత్వం కూడా మెట్టుదిగే పరిస్థితి కనిపించడం లేదు.. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిని రేపుతోంది.


Tags

Read MoreRead Less
Next Story