పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

X
Nagesh Swarna1 Dec 2020 1:17 PM GMT
పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం ప్రకటనపై పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చారు.
గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది మరణించారని పిటిషన్ లో తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును అభ్యర్థించింది.
Next Story