Top

ఏపీ దేవాదాయశాఖలో వెలుగులోకి వచ్చిన మరో అడ్డగోలు వ్యవహారం

ఏపీ దేవాదాయశాఖలో వెలుగులోకి వచ్చిన మరో అడ్డగోలు వ్యవహారం
X

ఏపీ దేవాదాయశాఖలో మరో అడ్డగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలోని రాఘవేంద్ర స్వామికి చెందిన మంత్రాలయం మఠం ఆస్తులను అమ్మేందుకు గుట్టుగా రంగం సిద్ధమైంది.. తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన.. 208 ఎకరాల భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ రంగం సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో E-టెండర్లు పిలిచారు మఠం సహాయ పరిపాలనాధికారి మాధవ శెట్టి.. భూముల నిర్వహణ మఠానికి భారంగా మారిందనే సాకు చూపుతూ అమ్మకానికి పెట్టింది.

అయితే హైకోర్టు తీర్పు ప్రకారం దేవాదాయశాఖ ఆస్తుల స్వభావం మార్చే అధికారం ప్రభుత్వానికి కానీ దేవాదాయశాకి కానీ అధికారం లేదు. ఒకవేళ విక్రయించాలని ప్రభుత్వం భావిస్తే హైకోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఏపీ దేవాదాయ శాఖ తీరుపై భక్తులు, హిందువులు మండిపడుతున్నారు.. కోర్టు అనుమతి తీసుకున్నారా ఆస్తులను విక్రయించేందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు..

Next Story

RELATED STORIES