Krishnapatnam :ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం..!

Krishnapatnam :ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం..!
కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీని అధికారులు నిలిపివేసిన నేపథ్యంలో ఔషదం పైన ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతునే ఉంది. ఓ వైపు నిపుణులు దీనిపైన హెచ్చరికలు జారీ చేస్తున్న .. ప్రజలు మాత్రం అనందయ్య కరోనా మందు పైన విశ్వాసం ఉంచుతున్నారు. అలాగే వారి విశ్వాసాన్ని పెంచే ఘటనలు రోజుకు ఒకటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్వాస అడక కింద పడిపోయిన వ్యక్తి కంటిలో చుక్కల మందు వెయ్యగానే పడి నిమిషాల్లో పైకి లేచి కూర్చున్నట్లు చెబుతున్నారు. దీన్ని మొత్తం వీడియో కూడా తీసారు.

కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీని అధికారులు నిలిపివేసిన నేపథ్యంలో ఔషదం పైన ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐసీఎమ్ఆర్ నిపుణులు ఈ సాయంత్రం కృష్ణాపట్నం వెళ్లనున్నారు. ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం చేయనున్నారు. కరోనా తగ్గడం కోసం పంపిణీ చేస్తున్న మందు శాస్త్రీయతను ఐసీఎంఆర్ అధికారులు పరిశీలించనున్నారు. మరో వైపు అనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణి అడ్డుకోవడంపై విమర్శలకు దారితీస్తోంది. అధికారుల తీరుపై స్థానికులు,విపక్ష నేతలు మండిపడుతున్నారు.

కార్పొరేట్ మెడికల్ మాఫియాకు కొమ్ముకాయడం కోసమే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా ఆయుర్వేద మందు పంపిణీ నిలిచిపోవడం పై అధికారులు ప్రభుత్వం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరులోని మెడికల్ మాఫియాకు లబ్ధి చేకూర్చేందుకే ఆయుర్వేద మందు పంపిణీ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆయుర్వేద వైద్యం కోసం వస్తున్న వారు తిరిగి వెళ్ళలేక ఆశగా ఎదురుచూస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story