స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులపై ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించేందుకు స్టేట్..

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులపై ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించేందుకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిందని పిటిషనర్ తాండవ యోగేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతను తప్పించడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమంటూ పిటిషనర్ తన వాదనను వినిపించారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేత లేకుండా ప్రయోజనం లేదని పిటిషనర్ తాండవ యోగేష్ అన్నారు. ఇక ఈ కేసును హైకోర్టు ధర్మాసనం వచ్చేవారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story