పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
తాజా తీర్పు నేపథ్యంలో డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. అవి కరోనా టీకా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

ఫిబ్రవరి 5 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఈనెల 8వ తేదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు. అయితే, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ విధించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలనే తాము అనుసరిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం అని ఆదిత్యనాథ్ తెలిపారు. మరోవైపు టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నందున ఈ ఎన్నికల నిర్వహణలో తాము పాల్గొనలేమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంతో.. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. తాజా తీర్పు నేపథ్యంలో డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story