ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధానిపై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు
X

ఏపీ రాజధానిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్తే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. విశాఖపట్నం రాజధానిగా కావాలని అధికార పార్టీ, అమరావతిలోనే కేపిటల్‌ ఉండాలని టీడీపీ ఎన్నికలకు వెళ్తే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని విషయంలో అధికారపక్షం, విపక్షాల మధ్య సవాళ్లు ఆరోగ్యవంతంగానే ఉన్నాయని తమ్మినేని అన్నారు. న్యాయవ్యవస్థపై విమర్శల కేసులో సీబీఐ ఏం చెప్తుందో వేచి చూద్దామని అన్నారు. శ్రీకాకుళంలో వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులతో మాట్లాడిన తమ్మినేని, రాజధానిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Next Story

RELATED STORIES