AP News : ఆశావర్కర్ల చలో విజయవాడ కు అడుగడుగునా అడ్డంకులు

AP News : ఆశావర్కర్ల చలో విజయవాడ కు అడుగడుగునా అడ్డంకులు
పలుచోట్ల ఉద్రిక్తత

డిమాండ్ల సాధన కోసం ఆశావర్కర్లు రోడ్డెక్కారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ.... ఆశా కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడకు వెళ్లకుండా ఆశా కార్యకర్తలను పోలీసులు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడకు వెళ్లేందుకు యత్నిస్తుండగా ఆశావర్కర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ. తాడేపల్లి జాతీయ రహదారిపై ఆశా కార్యకర్తులు బైఠాయించి నిరసన తెలిపారు. ఆశావర్కర్ల ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.


హామీల అమలు కోసం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రెండ్రోజుల ముందు నుంచే ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడకక్కడ నిర్బంధించారు. ముందస్తు అరెస్టులు చేశారు. అయినా పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని ఆశావర్కర్లు బయటకు వచ్చారు. విజయవాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద ఆశావర్కర్లను అరెస్టు చేశారు.విజయవాడ వెళ్లకుండా వడ్డేశ్వరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆశావర్కర్లను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆశాకార్యకర్తలు విజ్ఞానకేంద్రంలోనే నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే అడ్డగింతలేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆశావర్కర్లు బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసేయడంతో నిరసనకారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులను తోసుకుంటూ గేట్లు దూకి తప్పించుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడకు బయలుదేరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీస వేతనం 26వేలు ఇవ్వాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి జాతీయ రహదారిపై ఆశావర్కర్లు బైఠాయించారు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆశా కార్యకర్త లక్ష్మిస్పృహతప్పి పడిపోయారు.

గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకరక్యాలను కల్పించాలని దీర్ఘ కాలంగా పని చేస్తున్న ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని, సంబంధం లేని పనులు చేయించరాదని వారు కోరారు. 60 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు పనిచేయించుకొని ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించకుండానే తొలగించటం సరైంది కాదు తీవ్రంగా విమర్శించారు. 62 సం||ల రిటైర్మెంట్ జిఓ వర్తింప చెయ్యాలి, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్దాంతరంగా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్స్కు గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశాలుగా మార్పు చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story