రాజధాని రైతులకు బేడీలు : గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన

రాజధాని రైతులకు బేడీలు : గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన
రాజధాని రైతులకు పోలీసులు బేడీలు వేసి తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ, సీపీఐ నేతలు గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు..

రాజధాని రైతులకు పోలీసులు బేడీలు వేసి తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ, సీపీఐ నేతలు గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, గుంటూరు పార్లమెంటరీ ఇంచార్జ తెనాలి శ్రావణ కుమార్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ... బేడీలు వేయడాన్ని దారుణంగా తప్పుబట్టారు. డిఎస్పీ దుర్గా ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించాలని నేతలు నినాదాలు చేశారు. దళిత రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రైతులను వెంటనే విడులచేయాలని డిమాండ్ చేశారు. 28గ్రామాల రైతులు, 5 కోట్ల ఆంధ్రులు అమరావతి రాజధాని కావాలని 316 రోజులుగా ఉద్యమం చేస్తుంటే బాపట్ల ఎంపీ సురేష్ రైతులపై అక్రమ కేసులు పెట్టించి రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని అన్నారు.

అమరావతి ఉద్యమ తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి ఎస్సీలపై ఎట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. అమాయక రైతులకు బేడీలు వేసి ప్రభుత్వానికి పోగాలం వచ్చిందని ఎద్దేవాచేశారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story