విష్ణువర్ధన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న అమరావతి రైతులు

విష్ణువర్ధన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న అమరావతి రైతులు
అమరావతే రాజధానిగా ఉండాలన్న ఏకైక నినాదంతో రాజధాని గ్రామాల రైతులు 311 రోజులుగా పోరాటం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు నేతలు..

అమరావతే రాజధానిగా ఉండాలన్న ఏకైక నినాదంతో రాజధాని గ్రామాల రైతులు 311 రోజులుగా పోరాటం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు నేతలు.. ఇప్పటి వరకు అధికార వైసీపీ నేతలు దిగజారి మాట్లాటాన్ని అందరూ చూశారు.. కానీ, ఇప్పుడు ఏపీకి చెందిన బీజేపీ కీలక నేత విష్ణువర్ధన్‌ రెడ్డి అమరావతి పోరాటాన్ని ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయవాడలో నిన్న మీడియా సమావేశం పెట్టిన విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రభుత్వంతోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు.. ఓ పార్టీకి చెందిన మహిళా నేతపై విమర్శలు చేస్తూ అమరావతిని కూడా తన విమర్శల్లో కలిపారు.. 50వేల ఖరీదైన చీర కట్టుకుని రైతులతో కలిసి పోరాటం చేస్తున్నారంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు.. విష్ణువర్ధన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

విష్ణువర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అమరావతి రైతులు.. తాము అమరావతి ఉద్యమం గురించి మాట్లాడుతుంటే.. విష్ణువర్ధన్‌ రెడ్డి ఆడవాళ్ల చీరల గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మందడం గ్రామానికి చెందిన ఓ రైతు విష్ణువర్ధన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించాడు.. దమ్ము, ధైర్యం ఉంటే అమరావతి గురించి మాట్లాడుకుందాం రా అంటూ సవాల్‌ విసిరాడు.

అటు విష్ణువర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యలపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి.. విష్ణువర్ధన్‌ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ రాజధాని ప్రాంత మహిళలు ఫైరవుతున్నారు.. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా కూడా విష్ణువర్ధన్‌ రెడ్డిపై విమర్శల తూటాలు పేలుతున్నాయి.. రాష్ట్రమంతా అమరావతి గురించి మాట్లాడుతుంటే విష్ణువర్ధన్‌ రెడ్డి సంస్కారం లేకుండా ఆడవాళ్ల చీరల గురించి మాట్లాడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.. కరువు ప్రాంతంలో పంపు సెట్లు కొట్టేసిన కేసులో ఉన్న వాల్లు రంగురంగుల పట్టు కుర్తాలు, పైజమాలు ఆపై అరకోటు వేసుకుని తయారవుతున్నప్పుడు తరాలుగా మూడు పంటలు పండించిన వారు ఆ మాత్రం కట్టుకోరా అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.. మీ ఎలక్షన్‌ అఫిడవిట్‌ ప్రకారం మీ చదువు ఇంటర్‌ అని, మీపై రెండు కేసులు ఉన్నాయని.. అవికూడా ఆడవారిపై మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులేనంటూ గుర్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story