ఆంధ్రప్రదేశ్

అమరావతిని చంపేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది : బోండా ఉమ

అమరావతిని చంపేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది : బోండా ఉమ
X

లేని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని చంపటడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని అడుగుతున్న రైతులు, మహిళలు, ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ కక్ష సాధింపులకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలో లేని వారిని తీసుకొచ్చి రాజధానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయించడం దారుణమన్నారు. ప్రశ్నించినందుకు రైతులకు ఉగ్రవాదుల్లా బేడీలు వేసి జైల్లో పెట్టడం అనైతిక చర్య అటూ నిప్పులు చెరిగారు. దోచుకున్న భూములు కోసమే వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆరాటపడుతోందని బొండా ఉమ ఆరోపించారు.

Next Story

RELATED STORIES