ఏపీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ

ఏపీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీలో నిరసన సెగ తగిలింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు పెద్ద ఎత్తున చేరుకున్న కార్మికులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళనతో పోలీసులు ముందుగానే ఎయిర్‌పోర్టు వద్ద భారీగా మోహరించారు. కార్మికులు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వంద మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికులు, పోలీసు మధ్య ఘర్షణతో విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మోదీ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు, నిరాహారాదీక్షలు చేపడుతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు మద్దతుగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించగా.. ఢిల్లీలోనూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story