Chandrababu Naidu: టీడీపీ శ్రేణుల సంబరాలు..

Chandrababu Naidu: టీడీపీ శ్రేణుల సంబరాలు..
ట్రెండ్ అవుతున్న ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పట్ల హైదరాబాద్ లో తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు. N.T.R. భవన్ ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆనందోత్సవాలతో జై బాబు జైజై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సైకో పోవాలి బాబా రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలని హోరెత్తించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేం చేశారు. 53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. గత యాభై మూడు రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయాయి.

చంద్రబాబుపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు వెనుకాడబోమని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబు... వైకాపా అక్రమ కేసులకు భయపడబోరని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటషన్ పై అనుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రామ్మోహన్ నాయుడుతో ముఖాముఖి.

పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టపాసులు పేల్చారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ శ్రేణులు నినాదాలు చేశారు.


కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం నేత వెనిగండ్ల రాము కార్యాలయంలో సంబరాలు జరిపారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు జనసైనికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన తెలుగు యువత కార్యకర్తలు పట్టలేనంత ఉత్సాహంతో చిందులు వేశారు. పట్టణంలోని టీ కూడలిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. వైఎస్ ఆర్ జిల్లా వేంపల్లిలో తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story