ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ
X

కుప్పం నియోజకవర్గంలో నిన్నటి పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీకి టీడీపీ అథినేత చంద్రబాబు లేఖ రాశారు.. టీడీపీ నాయకుల గృహ నిర్బంధాలపై లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ నాయకులను గృహ నిర్బంధానికి గురిచేయడం ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని మండిపడ్డారు. కుప్పం ప్రజలు శాంతియుత ఆందోళనల ద్వారా సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం కంటే ప్రభుత్వానికి వేరే ఇతర ప్రాధాన్యాలు ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రశాంతంగా, నిరాయుధంగా ఒకచోట గుమిగూడే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు.

నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలకు గురిచేయడం బ్రిటీష్‌ రాజును గుర్తు తెస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇది విషాదకర పరిణామం అన్నారు. అక్రమ నిర్బంధాలకు గురైన వారిని తక్షణ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక అరెస్టులకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని చిత్తూరు జిల్లా ఎస్పీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

Next Story

RELATED STORIES