దళిత ఎంపీ దుర్గాప్రసాద్ సంతాప తీర్మానంపై చర్చను వైసీపీ బాయ్‌కాట్ చేసింది : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీ దుర్గాప్రసాద్ సంతాప తీర్మానంపై చర్చను వైసీపీ..

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీ దుర్గాప్రసాద్ సంతాప తీర్మానంపై చర్చను వైసీపీ బాయ్‌కాట్ చేయడం నీచమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. కనీసం దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీఎం జగన్ ఇంట్లో నుంచి బైటకు రాలేదన్నారు. దళితులపై దాడులను ఖండించడానికి జగన్‌కు నోరు రాదని.. కనీసం సానుభూతి చెప్పడానికి కూడా మనసు లేదని విమర్శించారు. వారి సభ్యుడిపై కూడా వారికి కనికరం లేకపోవడం కంటే కిరాతకం మరొకటి లేదన్నారు చంద్రబాబు. GST నిధుల కోసం ప్రతిపక్షాల ధర్నాలో వైసీపీ ఎంపిలు పాల్గొనక పోవడం గర్హనీయమన్నారు. కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ద, GST నిధులు రాష్ట్రానికి రాబట్టడంపై లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కండిషన్ బెయిల్ పై ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడం దివాలాకోరుతనమన్నారు.
వైసీపీ తప్పులు చేసి నిందలు మాత్రం కోర్టులపై వేస్తోందని.. ప్రతిపక్షాలపైనా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జడ్జిలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై వైసీపీ దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు చంద్రబాబు. 16నెలల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు అన్నింటిపై CBI దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో 4వేల కోట్ల స్కామ్‌లపై సీబీఐ విచారణ జరపాలన్నారు. మద్యం నాసిరకం బ్రాండ్లు, జె ట్యాక్స్ వసూళ్లపై సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇసుక, లేటరైట్, గ్రానైట్ మైనింగ్ మాఫియా స్కామ్‌లపైనా సీబీఐ విచారణ కోరాలన్నారు. అంతర్వేదితో సహా ఆలయాలు అన్నింటిపై దురాగతాలపై దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT