ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ..

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ.. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ.. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ.. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ..

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై క్లారిటీ..
X

క‌రోనా లాక్‌డౌన్‌ నేప‌థ్యంలో ర‌ద్దైన అంత‌ర్ రాష్ట్ర ఆర్టీసీ బస్సు సేవ‌లు ఇప్పట్లో పునరుద్ధరణ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కేంద్ర ప్రభుత్వం అంత‌ర్ రాష్ట్ర ఆర్టీసీ సేవ‌లు ఆయా రాష్ట్రాల‌కే వ‌దిలేయ‌డంతో కొన్ని రాష్ట్రాల మ‌ధ్య ర‌క‌పోక‌లు సాగుతున్నాయి. అయినా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాత్రం ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. మొద‌ట క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అంత‌ర్ రాష్ట్ర స‌ర్వీసులు అనుమ‌తి నిరాక‌రించిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స‌ర్వీసుల పుణ‌రుద్దర‌ణ‌కు చ‌ర్చలు నెర‌పుతున్నాయి. ఎండీలు, ఈడీల మ‌ధ్య చ‌ర్చలు జ‌రుగుతున్నా పురోగ‌తి మాత్రం క‌నిపించ‌డం లేదు. తాజాగా మారోమారు భేటీ అయ్యారు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు. ఎర్రమంజిల్ ఆర్అండ్‌బీ కార్యాల‌యంలో స‌మావేశం అయిన అధికారులు చ‌ర్చలు మ‌రోమారు వాయిదా వేసారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. ఏపీఎస్ ఆర్టీసీ స‌ర్వీసుల వ‌ల్ల త‌మ‌కు క‌లిగే న‌ష్టాల‌ను గ‌త ఆరేళ్ళుగా చెబుతూ వ‌స్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విభ‌జ‌న చ‌ట్టాన్ని అడ్డుపెట్టుకుని అద‌నంగా ల‌క్షా 20 వేల కిలోమీట‌ర్లు తెలంగాణ‌లో తిప్పుకుంటున్నాయ‌ని ఆ మేర‌కు త‌మ‌కు కూడా ఏపీలో స‌ర్వీసులు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలంటూ వాదిస్తూ వ‌స్తున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తుల‌ను అక్కడి ప్రభుత్వం, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చూస్తూ వ‌చ్చారు. ఇది తేలే వరకు అంత‌‌ర్ రాష్ట్ర స‌ర్వీసులు నడిపేది లేదని తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అంత‌ర్ రాష్ట్ర స‌ర్వీసుల అవ‌స‌రం తెలంగాణ కంటే ఏపీకే ఎక్కవ‌గా ఉంటుంది. ఏపీఎస్ ఆర్టీసీ స‌ర్వీసులు తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల నుండి త‌మ ప్రయాణికుల‌ను చేర‌వేస్తుంటాయి. హైద‌రాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ‌లోని వివిధ ప‌ట్టణాల నుంచి కూడా ఏపీకి స‌ర్వీసులు వెళ్తుంటాయి. కాని తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులు మాత్రం కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం అయ్యాయి. దీంతో తెలంగాణ స‌ర్వీసులు ఏపీకి వెళ్ళక పోయినా పెద్దగా న‌ష్టం లేదు. ఏపీ స‌ర్వీసులు తెలంగాణ‌కు రాక‌పోతే మాత్రం ఆ సంస్థకు ఇబ్బందులు త‌ప్పవు. దీంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఉంచిన డిమాండ్లకు త‌లొగ్గక తప్పే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ స‌ర్వీసులు ఏపీలో మ‌రో యాభై వేల కిలోమీటర్లు తిప్పేందుకు ఓకే అధికారులు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం స‌ర్వీసులు తిప్పుకునేందుకు అనుమ‌తులు ఇస్తూనే కొర్రీలు పెడుతోంద‌ని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ‌లో ఎక్కడెక్కడ త‌మ స‌ర్వీసులు తిప్పుతారో రూట్ మ్యాప్ ఇవ్వాలని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులను ఇక్కడి అధికారులు కోరారు. ఈ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కృష్ణబాబు ప్రభుత్వంతో చ‌ర్చించిన త‌రువాత త‌మ నిర్ణయం చెబుతామ‌న్నారు. రెండు మూడురోజుల త‌రువాత ఈడీ స్థాయి అధికారులతో చ‌ర్చించిన అనంత‌రం ఓ నిర్ణయానికి వ‌స్తామ‌ని చెబుతున్నారు ఇద్దరు ఎండీలు. ఎండీల స్థాయిలోనే తేల‌ని అంశం ఈడీల స‌మావేశంలో తేలుతుందా అనేది అనుమాన‌మే. దీంతో అధికారుల స్థాయిలో ఈ స‌మ‌స్య ప‌రిశ్కారం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌క పోవ‌డంతో మంత్రులు, లేదా రాజకీయ జోక్యంతోనే ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉందంటున్నారు కార్మిక సం‌ఘాల నేతలు.

Next Story

RELATED STORIES