ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌ ఆస్తుల కేసు ఈనెల 12కు వాయిదా

సీఎం జగన్‌ ఆస్తుల కేసు ఈనెల 12కు వాయిదా
X

ఏపీ సీఎం జగన్‌ ఆదాయానికి మించి ఆస్తుల కేసును సీబీఐ కోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని కోర్టును జగన్‌ తరఫు న్యాయవాది కోరారు. అటు.. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో.. అన్ని కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో కేసుల విచారణ వేగవంతమైంది. జగన్‌కు సంబంధించి స్టే ఉన్న నాలుగు కేసులతో పాటు.. మిగిలిన అన్ని కేసులను సీబీఐ కోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES