Crime: మైనర్‌ బాలికపై వైసీపీ సర్పంచ్‌ కుమారుడు లైంగిక దాడి

Crime: మైనర్‌ బాలికపై వైసీపీ సర్పంచ్‌ కుమారుడు లైంగిక దాడి
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో దారుణం

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో దారుణం జరిగింది. మైనర్‌ బాలికపై వైసీపీ సర్పంచ్‌ కుమారుడు, మరో నలుగురు యువకులు కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ఈలతోటల వద్ద మంచి నీటికోసం వెళ్లిన బాలికపై యువకులు లైంగిక దాడి చేసినట్లు సమాచారం. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు భాదిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అమలాపురం డీఎస్‌పీ, ముమ్మిడివరం సీఐ విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story