TTD: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై విమర్శలు

TTD: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై విమర్శలు

టీటీడీ బోర్డు సభ్యులను జగన్ సర్కారు ప్రకటించింది. ప్రతిష్టాత్మక పదవుల్లో సిఫార్సులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న విమర్శలు భారీ ఎత్తున్న వస్తున్నాయి. చెన్నైకి చెందిన ఆడిటర్‌ కృష్ణమూర్తి వైద్యనాథన్‌.. టీటీడీ బోర్డులో నాలుగోసారి ఆయన సభ్యత్వం సంపాదించారు. ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది.

తమకు కావాల్సిన వాడైతే చాలు అందలం ఎక్కిస్తాం...అడ్డుగా ఉన్న నిబంధనలు మార్చేస్తాం..అన్న చందాన ఉంది ఏపీలో జగన్‌ సర్కార్‌ వైఖరి. ఓవ్యక్తి కోసం నింబంధనలను సవరించడం అనేది ఉండదు.అయితే ఏపీలో ఇది మాత్రం సాధ్యమే అంటుంది వైసీపీ ప్రభుత్వం.టీటీడీ సభ్యుల నియామకంలో జరిగింది ఇదే. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యక్తి కృష్ణమూర్తి వైధ్యనాథన్‌ కోసం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఎండోమెంట్‌ టీటీడీ సభ్యులు ఎవరూ వరుసగా రెండుసార్లు మించి కొనసాగడానికి వీల్లేదు.అయితే ప్రభుత్వం కృష్ణమూర్తి కోసం ఏకంగా ఏపీ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలీజియన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ 1987 లోని సెక్షన్‌ 19ను ప్రత్యేకంగా ఆయన కోసం సవరణ చేసింది.ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ పాలమండలి సభ్యులపేర్లను ప్రకటించినప్పటి నుంచీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అన్యమతస్థులను, కేసులున్నవారిని, జైలుకు వెళ్లొచ్చిన వారిని నియమించారని రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున విమర్శించాయి. అయినా సర్కార్‌ మాత్రం ప్రత్యేక జీవో విడుదల చేసింది.

ఇక కృష్ణమూర్తి వైథ్యనాథన్‌కు దేశంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపధ్యం లోనే ఆయన వరుసగా మూడోసారి టీటీడీలో సభ్యుడిగా నియమితులయ్యారు.2019లో జగన్‌ అధికారం రావడంతోనే కృష్ణమూర్తిని టీటీడీలో నియమించారు.2021లో కొత్తగా ఏర్పాటుచేసిన పాలకమండలిలో ఆయనకు స్థానం కల్పించలేదు. అయితే తనకు ఉన్న పలుకుబడితో రెండోసారి బోర్డులో స్థానం కల్పించాలని జగన్‌ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని టీటీడీ వర్గాల్లోనే చర్చ జరిగింది.దీంతో జగన్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో రాజీనామా చేయించి.. కృష్ణమూర్తిని ఆమె స్థానంలో నియమించారన్న చర్చ అప్పట్లో జరిగింది. మొత్తానికి 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో ఆరేళ్లు ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మళ్లీ ఇప్పుడూ అవకాశం దక్కింది. వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చకా కేంద్రంలోని కీలకమంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి టీటీడీ సభ్యుడిగా వరస అవకాశాలను పొందుతున్నారని చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story