దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం

దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం
మురుగు కాలువ విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం రాజకీయ రంగు పులుముకుంది

అనంతపురం జిల్లా తరిమెలాలో దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది. మురుగు కాలువ విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో లక్ష్మీదేవి, ఆమె కుమారుడు రమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. లక్ష్మీదేవి మృతి చెందగా రమేష్‌ కు ప్రాణాపాయం తప్పింది. మురుగు కాలువ విషయంలో లక్ష్మీదేవితో గంపయ్య కుటుంబం గొడవకు దిగింది. అయితే స్థానిక వైసీపీ నేతలు మాత్రం గంపయ్య కుటుంబానికే మద్దతు తెలిపారు. అక్కడితో ఆగకుండా రమేష్‌పై అత్యాచారయత్నం కేసు పెట్టించి జైల్లో వేశారు.

ఇక రమేష్ జైలుకు వెళ్లి వచ్చిన తరువాత కూడా గంపయ్య కుటుంబ సభ్యులు అతన్ని వదల్లేదు. మరోసారి దాడికి తెగబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తల్లికుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మీదేవి మృతి చెందారు. ఈ ఘటనతో దళితులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story