CELEBRATIONS: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి

CELEBRATIONS: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి
పలు ప్రాంతాల్లో నరకాసుర వధ.... టపాసుల మోతతో దద్దరిల్లిన రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఇళ్లను ప్రమిదలు, విద్యుద్దీపాలతో సుందరంగా..అలంకరించారు. చిన్నారులు టపాసులు కాల్చి సందడి చేశారు. తెలంగాణలో దీపావళిని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో నరకాసుర వధను నిర్వహిస్తున్నారు. టపాసుల అమ్మకం కేంద్రాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. బాణసంచా ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. ప్రకాశంలో రుక్మిణీ సత్యభామ అవతారంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి నరకాసురున్ని వధించారు. రాజాజీ వీధి, నాయుడు వీధి నరకాసురున్ని వధ నిర్వహించారు. లండన్‌లో కూడా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఫ్రెండ్స్‌ ఇన్ లండన్" ఆధ్వర్యంలో బ్రెంట్వుడ్ నగరంలో దీపావళిని ఘనంగా నిర్వహించుకున్నారు. 400 మందికిపైగా ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


ప్రకాశం జిల్లా మార్కాపురం దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు నరక చతుర్థి సందర్భంగా పట్టణంలో పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా రుక్మిణీ సత్యభామ అవతారంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి నరకాసురున్ని వదించారు. పట్టణంలోని రాజాజీ వీధి, నాయుడు వీధి నరకాసురున్ని వధించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


కాకినాడలో నరకాసుర వధ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని పట్టణాల నుంచి పల్లెల వరకు మార్కెట్లు సందడిగా ఉన్నాయి.. వాతావరణ కరుణించడంతో గత రెండు రోజులుగా ఎండలు కాస్తున్నాయి.. దీంతో దీపావళి మందు సామాన్లు కొనుగోలు పెరిగాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లోను ప్రతి సెంటర్లోను దీపావళి టపాసులు అమ్మకాల షాపులకు వెలిశాయి. పోలీసులు అగ్నిమాపక.. రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడంతో షాపుల సంఖ్య భారీగా పెరిగాయి.. అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.. వెలుగులు విరజిమ్మే అగ్గిపెట్టెల నుండి థౌసండ్ వాళ్ళ 5000 వాలా వరకు ధరలు సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు కొనే స్థితిలో లేవు.. దీపావళి నోముల ఆచరించేవారు దివిటీలు కొట్టేందుకు పెద్ద గోగుమెక్కలు అమ్మకందారులు అందుబాటులో ఉంచారు. ఇండియన్ ఫ్రెండ్స్‌ ఇన్ లండన్" ఆధ్వర్యంలో బ్రెంట్వుడ్ నగరంలో దీపావళిని ఘనంగా నిర్వహించుకున్నారు. 400 మందికిపైగా ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story