DIWALI: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి

DIWALI: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి
వెలుగులు విరజిమ్ముతున్న తెలుగు లోగిళ్లు.... గ్రీన్ కాకర్స్‌కు పెరిగిన గిరాకీ

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి నెలకొంది. కాంతిని వెదజల్లే దీపాలు... ఊరూ వాడా, పల్లె- పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో విరాజిల్లుతోంది. టపాకాయలు, నోటిని తీపి చేసే తీపి పదార్థాలు ఇవన్నీ పండగ సందడిని రెట్టింపు చేస్తాయి. ప్రమిదలు, టపాకాయలు కొనడంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు బిజీ అయ్యారు. మార్కెట్లన్నీ కొనుగులదారులతో సందడిగా ఉన్నాయి. ధన త్రయోదశి సందర్భంగా పూజ కోసం బంగారం కొనేవారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంటో ఆ షాపులు కూడా వినియోగదారులతో రద్దీగా ఉన్నాయి. తీపి పండగ కోసం స్వీటు షాపుల వద్ద జనం బారులు తీరారు.


గత సంవత్సరంతో పోలిస్తే టపాసుల ధరలు పెరిగాయని ప్రజలు చెబుతున్నారు. టపాసులు అమ్ముకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంపై వ్యాపారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరకు మూడు రోజులు దీపావళి సామాగ్రి అమ్ముకోవడానికి అవకాశం ఉండేదని గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాన్ని షాకుగా చూపి రెండు రోజులు మాత్రమే టపాసులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం సరైంది కాదని వ్యాపారులు విమర్శించారు. ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని భావించినా ఆశించిన స్థాయిలో సాగడం లేదని టపాసులు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.


కొందరు విద్యుత్ దీపాలతో ఇళ్లను అలంకరిస్తారు. భిన్న రకాలు, భిన్న రూపాల్లో, ప్రత్యేకమైన రంగుల్లో వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు తగినట్లు తయారు చేసి అమ్ముతున్నారు. 3 రూపాయల నుంచి 300 రూపాయల వరకు వస్తువులను బట్టి ధరలు ఉన్నాయి. షాపుల్లో డిజైన్ చేసిన ప్రమిదలు అమ్ముతున్నప్పటికీ వాటికి ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రోడ్డు పక్కన అమ్మేవి నేరుగా ఉత్పత్తి దారుల నుంచి తీసుకురావడం వల్ల అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ దీపావళి పండగకు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. వీరి కోసం ప్రమిదలతో పాటు బొమ్మల కొలువు కోసం ప్రత్యేకమైన కళాకృతులు, వొత్తులు, ఇతర పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు.విక్రయిస్తున్నారు. వీటికి కూడా ఆదరణ బాగుందని అమ్మకం దారులు అంటున్నారు. టపాకాయలు కాకుండా గ్రీన్ క్రాకర్స్ కొంటున్నారు. వీటికి కాస్త ధర ఎక్కువైనా గాలి కాలుష్యం కాకుండా తమ వంతు కృషి చేశామనే తృప్తి ఉంటుంది కాబట్టి డబ్బు ఎక్కువైనా వీటిని కొనుగులు చేస్తున్నారు. వీటిని కూడా టపాకాయల షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఖాళీగా ఉంటే మైదాన ప్రాంతాల్లో ప్రత్యేక షాపుల్లో విక్రయిస్తున్న టపాకాయల షాపులు కొనుగోలుదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story