ఆంధ్రప్రదేశ్

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. దేవరట్టులో ఆగని కర్రల సమరం

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. దేవరట్టులో ఆగని కర్రల సమరం
X

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, అధికారులు ఎంతగా హెచ్చరించినా దేవరట్టులో కర్రల సమరం మాత్రం ఆగలేదు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కర్రలు, దివిటీలతో కొట్టుకున్నారు. వీరిలో 60 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆదోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మాలమల్లేశ్వరస్వామి కల్యాణం సందర్భంగా సాగే బన్నీ ఉత్సవాలను కరోనా కారణంగా అధికారులు నిలిపివేశారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భక్తులు భారీగా తరలి వచ్చారు. దేవర గట్టులో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు,4 డ్రోన్ లతో పర్యవేక్షణ చేపట్టినా వివిధ మార్గాల్లో భక్తులు తరలివచ్చారు. ప్రాణాలకంటే తమకు బన్నీ ఉత్సవాలే ముఖ్యమంటూ కర్రల సమరంలో పాల్గొన్నారు.


Next Story

RELATED STORIES