ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి దళిత వాడలో ఘర్షణ

కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి దళిత వాడలో ఘర్షణ
X

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ, లంకవాని వాడల్లో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లతో గాయపడ్డారు. వీరిని చల్లపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన చికిత్సకోసం మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. పాతకక్షల కారణంగా కొందరు మద్యం తాగి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఘర్షణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిపై గతంలోకూడా కేసులున్నాయని చల్లపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ వెల్లడించారు. ఘర్షణ కారణంగా స్థానికులు భయాందోళకు గురవుతున్నారు.

Next Story

RELATED STORIES