ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నగజరాజులు

విజయనగరం జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నగజరాజులు
X

విజయనగరం జిల్లాలో గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొమరాడ మండలం బంగారంపేట-కోమట్లపేట అంతర్రాష్ట్ర రహదారిపై ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ప్రతిరోజు సాయంత్రం నాలుగు తరువాత రోడ్లపై ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటువైపు వెళ్లాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.

ఇటీవలే ఏనుగుల దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఏనుగుల గుంపు జనవాసాల్లోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఏనుగుల సంచారంతో రోజు చస్తూ బతుకుతున్నామని.. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రజలు ఏనుగులను తమ ఊళ్లోకి రాకుండా తరిమే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES