ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివారులో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో కాపలాగా నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి..

చిత్తూరులో ఏనుగుల బీభత్సం
X

చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివారులో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో కాపలాగా నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఏనుగుల దాడిలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని సోనియా మరణించగా... ఆమెను కాపాడే క్రమంలో తండ్రి మురుగన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విచాదచాయలు అలుముకున్నాయి.

తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో... దానికి తోడు దట్టమైన అడవులు ఉండటంతో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. కుప్పం పరిసర ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే సమయానికి ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఏనుగుల నియంత్రణకు అధికారులు శాశ్వత పరిష్కారం చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES