ఆంధ్రప్రదేశ్

హిందూ ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి : చినరాజప్ప

హిందూ ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి..

హిందూ ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి : చినరాజప్ప
X

హిందూ ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని అన్నారు. అంతర్వేది ఘటనపై మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదమని మండిపడ్డారు. అంతర్వేది ఘటనలో కుట్ర కోణం ఉందన్న చినరాజప్ప... సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవదాయశాఖను పట్టించుకోవడం లేదని చినరాజప్ప ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని చినరాజప్ప విమర్శించారు.

Next Story

RELATED STORIES