ఆంధ్రప్రదేశ్

అంతర్వేది ఘటనపై కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలి : మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి

అంతర్వేది ఘటనపై కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించి నిజాలు తేల్చాలన్నారు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి..

అంతర్వేది ఘటనపై కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలి : మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి
X

అంతర్వేది ఘటనపై కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించి నిజాలు తేల్చాలన్నారు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి. రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ మధ్యకాలంలో మతపరమైన దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. టీటీడీ విషయంలోనూ అనేక వివాదాలు నడుస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దాడులు జరిగి అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు అమర్‌నాథ్‌ రెడ్డి.

Next Story

RELATED STORIES