ప్రశ్నిస్తే ప్రతీకారానికి దిగుతారా? కూల్చివేతలతో భయపెడుతారా? : మాజీ ఎంపీ సబ్బం హరి

ప్రశ్నిస్తే ప్రతీకారానికి దిగుతారా? కూల్చివేతలతో భయపెడుతారా? : మాజీ ఎంపీ సబ్బం హరి
ప్రశ్నిస్తే ప్రతీకారానికి దిగుతారా? కూల్చివేతలతో భయపెడుతారా? తప్పులను ఎత్తిచూపిన వారిపై కక్షసాధించడమే ప్రభుత్వ ఎజెండానా? విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహారీ గోడతో..

ప్రశ్నిస్తే ప్రతీకారానికి దిగుతారా? కూల్చివేతలతో భయపెడుతారా? తప్పులను ఎత్తిచూపిన వారిపై కక్షసాధించడమే ప్రభుత్వ ఎజెండానా? విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహారీ గోడతో పాటు ఆ ప్రాంగణంలోని నిర్మాణాలు కూల్చివేసిన తీరు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు జేసీబీలతో వెళ్లిమరీ కూల్చివేయాల్సిన అవసరం ఏ ముంది? కనీసం నోటీసులు ఇవ్వకుండా అంత హడావుడిగా..అర్జెంట్‌గా ఎందుకు పడగొట్టారు? ఆ ఐదు అడుగుల స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పినా జీవీఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఉన్నతాధికారుల ఆదేశాలతోనే వచ్చామంటూ జీవీఎంసీ అధికారులు మౌనం దాల్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.! రాత్రికి రాత్రే ఆదేశాలు ఇచ్చి.. అధికారులపై ఒత్తిడి పెంచి.....తెరవెనుక నుంచి తతంగం నడిపించిన ఆ వ్యక్తి ఎవరు?

విశాఖ సీతమ్మధారలోని సబ్బంహరి నివాసం వద్ద తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన నివాస గృహం ప్రహారీ గోడతోపాటు ఆ ప్రాంగణంలోని నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పకపోవడం ఏంటని మండిపడ్డారు. ఐదు అడుగుల స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆదేశాలు ఎవరిస్తారో తనకు తెలుసని.. వాళ్లు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలతో తన గొంతును ఎవరూ నొక్కలేరని స్పష్టం చేశారు సబ్బం హరి.

Tags

Read MoreRead Less
Next Story