ఆంధ్రప్రదేశ్

విశాఖకు పాకిన వైసీపీ విధ్వంస కాండ..!

కట్టడానికి కష్టపడాలి కానీ... కూల్చడానికి ఎందుకు..? ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఎంతో కష్టపడి..

విశాఖకు పాకిన వైసీపీ విధ్వంస కాండ..!
X

కట్టడానికి కష్టపడాలి కానీ... కూల్చడానికి ఎందుకు..? ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఎంతో కష్టపడి... ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిస్తే.. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ... తమదైన శైలిలో ఆ పవిత్ర నిర్మాణాలను కుప్ప కూలుస్తోంది. అధికారంలోకి రాగానే ప్రజా వేదికతో ప్రారంభమైన కూల్చివేతల పర్వం.. ఇప్పుడు ప్రశాంత ఉత్తరాంధ్రకూ పాకింది. రాజకీయాల్లో నిర్వివాది.. సౌమ్యుడిగా పేరున్న సబ్బం హరి ఇంటి ప్రహరీతోపాటు అక్కడి నిర్మాణాలను... GVMC అధికారులు ఈ తెల్లవారు జామున కూల్చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా..

ఆ ఇంట్లో మనుషులు ఉంటున్నారన్న కనీస మానవత్వం లేకుండా.. అందరూ నిద్రపోతున్న వేళ... బుల్డోజర్లతో వచ్చి విధ్వంసం సృష్టించారు. అన్ని అనుమతులు ఉన్నాయని స్వయంగా సబ్బం హరి చెబుతున్నా.. వినిపించుకున్నవారే లేరు. పై నుంచి ఆదేశాలున్నాయి కూల్చివేయాలంటూ తెగేసి చెప్పారు. ఇంతకీ పై నుంచి అలాంటి ఆదేశాలు ఇచ్చిన పెద్దలెవరు..? అక్రమాలుంటే.. ఉదయం 10 గంటల తర్వాత వచ్చి కూల్చివేయవచ్చు కదా..? ఐదారు గంటల్లో ఈ చిన్న నిర్మాణం వల్ల విశాఖలో ప్రళయం ఏమైనా వచ్చిపడుతుందా..? కేవలం ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నారని... అవినీతిని ఎలుగెత్తి చూపుతున్నారన్న అక్కసుతో ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంత వరకు సమంజసం.

Next Story

RELATED STORIES