ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూత
BY kasi14 Oct 2020 3:01 AM GMT

X
kasi14 Oct 2020 3:01 AM GMT
ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు మృతి చెందారు. 1962లో విశాఖ జిల్లా అనకాపల్లెలో జన్మించిన శోభానాయుడు... చిన్న వయసులోనే నృత్యరూపకాల ద్వారా ప్రసిద్ధి చెందారు. విఖ్యాత కూచిపూడి గురువు వెంపటి చినసత్యం శిష్యురాలిగా.... ఆయన బృందంలో సభ్యురాలిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలతో గుర్తింపు పొందారు. నృత్యరూపకాల్లో సత్యభామ, పద్మావతి పాత్రలతో ప్రసిద్ధి చెందారు.
కూచిపూడి నృత్యకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శోభానాయుడు.... 2001లో పద్మశ్రీ అవార్టు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ, నృత్య కళాశిరోమణి, నృత్య చూడామణి, ఏపీ ప్రభుత్వం అందించే హంసా అవార్డులు శోభానాయుడును వరించాయి. దేశ విదేశాల్లో సుమారు 15 వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించారు.
Next Story
RELATED STORIES
Kajal Aggarwal: కొడుకుతో కాజల్.. క్యూట్ ఫోటోస్
17 May 2022 8:15 AM GMTHappy Birthday Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర పై హవా
17 May 2022 7:45 AM GMTRRR In OTT : RRR ఓటీటీ హిందీ వెర్షన్ ఎప్పుడంటే?
17 May 2022 7:15 AM GMTChethana Raj : ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ నటి మృతి..!
17 May 2022 6:21 AM GMTDimple Hayathi : బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్.. భారీ రెమ్యునరేషన్...
17 May 2022 4:30 AM GMTHarish Shankar : హరీష్ మరో రీమేక్.. తెలుగులో ఎవరితో.. ?
17 May 2022 1:45 AM GMT