నా భూమిపై.. నీ బొమ్మేంటి?.. రైతన్న జగన్‌ సర్కారును అడుగుతున్న ప్రశ్న

నా భూమిపై.. నీ  బొమ్మేంటి?.. రైతన్న జగన్‌ సర్కారును అడుగుతున్న ప్రశ్న
నా భూమిపై.. నీ బొమ్మేంటి? ఇది ఓ సామాన్య రైతన్న జగన్‌ సర్కారును అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగింది

నా భూమిపై.. నీ బొమ్మేంటి? ఇది ఓ సామాన్య రైతన్న జగన్‌ సర్కారును అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగింది. చిరుమాన్‌ దొడ్డికి చెందిన ఓ రైతు తన పట్టాదారు పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు ముద్రించారంటూ ప్రశ్నించాడు. భూములను రీసర్వే చేసి భూశాశ్విత హక్కు అంటూ రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నారు అధికారులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు పట్టదారు పుస్తకాన్ని తహసీల్దారు టెబుల్‌పై విసిరేసి తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. భూమి నాదైతే జగన్‌ ఫోటో ఎందుకు వేశారంటూ మండిపడ్డాడు. అంతేకాదు పట్టాదారు పుస్తకమంతా తప్పుల తడకగా ఉందంటూ ఫైర్‌ అయ్యాడు. తన భూమి 122 సర్వె నెంబర్‌లో 6 ఎకారాల 62 సెంట్లు ఉండగా 6 ఎకరాల 61 సెంటుగా నమోదు చేశారంటూ మండిపడ్డారు. రైతు ఆగ్రహించడంతో ఏం చెప్పాలో తెలియక కంగారు పడ్డారు అధికారులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story