అమరావతి పోరాటంలో న్యాయం ఉంది.. పోలీసులకు కనిపించడం లేదు..

అమరావతి పోరాటంలో న్యాయం ఉంది.. పోలీసులకు కనిపించడం లేదు..
అమరావతి పోరాటంలో న్యాయం ఉంది.. కానీ, అది పోలీసులకు కనిపించడం లేదు.. ఒకే రాజధాని, అది అమరావతే కావాలంటూ చేస్తున్న నినాదంలో ధర్మం ఉంది.. అది ఖాకీలకు..

అమరావతి పోరాటంలో న్యాయం ఉంది.. కానీ, అది పోలీసులకు కనిపించడం లేదు.. ఒకే రాజధాని, అది అమరావతే కావాలంటూ చేస్తున్న నినాదంలో ధర్మం ఉంది.. అది ఖాకీలకు వినిపించడం లేదు.. 310 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ధర్మం వైపు నిలబడలేదు.. ఆదుకోవాల్సిన, అండగా నిలవాల్సిన ప్రభుత్వమే కుట్రలు చేస్తోంది. విషం చిమ్మడానికే అన్నట్లుగా అడుగడుగునా గోతులు తీస్తోంది. వున్న అమరావతిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులంటూ వికృత ఆటకు తెరలేపింది. ఈ ఆటలో ఖాకీలు కూడా సర్కారు ఆలోచనలకు తగ్గట్లుగా ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అమరావతి విషయంలో పోలీసులు కూడా పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.. ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంలో వివిధ రూపాల్లో రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారు.. అన్ని ప్రాంతాల నుంచి ర్యాలీగా మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వచ్చి దీక్షలు చేస్తున్నారు.. నినాదాలతో హోరెత్తిస్తున్నారు.. అయితే, రైతుల దీక్షలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది.. దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలంటూ రైతులు, మహిళలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.. అయితే, పోలీసుల తీరుపై అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై ఎందుకీ కక్ష సాధింపులంటూ పోలీసులను నిలదీస్తున్నారు.. దీనికి పోలీసులు చెబుతున్న కారణాన్ని విని రాజధాని రైతులు నివ్వెరపోతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఇక్కడకు వస్తారని.. వారి కోసం అమరావతి రైతులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులే చెప్పడంతో రైతులు రగిలిపోతున్నారు.

పోలీసులు అనుసరిస్తున్న వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. పోలీసులే పోటీ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారా..? ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన జరిగింది అమరావతి కోసమా..? మూడు రాజధానుల కోసమా..? 310 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా కనీసం స్పందించని పోలీసులు.. ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర పోరాటానికి ఎలా అనుమతిస్తారు..? ఇది శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలకూ అవరోధాలు సృష్టించడం కాదా..? అసలు మూడు రాజధానులకు ఎంత మంది మద్దతిస్తున్నారు..? మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా పోలీసులే మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే అనుమతులు ఇవ్వడం కుదరదని కరాఖండీగా చెప్పే పోలీసులు.. ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ కోసమంటూ కొందరు ముందుకొస్తే వారికి ఆపాయింట్‌మెంట్‌ ఇవ్వడమేంటి..?

అమరావతి రైతులు కూడా దీక్షా ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు.. ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసింది ఒక రాజధాని కోసమని.. మూడు రాజధానుల కోసం కాదని స్పష్టం చేస్తున్నారు.. తాము ఉండగా వారికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు.. ఏం జరిగినా, ఎవరొచ్చినా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.

Tags

Read MoreRead Less
Next Story