తూర్పుగోదావరి జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం

X
Nagesh Swarna14 Dec 2020 9:33 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. అయినవిల్లి మండలం తొత్తరమూడి గుంట్రువారిపేటలో గుర్రాల సంయుక్త అనే బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య గుర్రాల వెంకటలక్ష్మినే కూతురిని కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story