Bhadhrachalam: కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

Bhadhrachalam: కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి
భద్రాచలం కరకట్ట మీద బారికేడ్స్‌ ఏర్పాటు; కరకట్ట ప్రాంతంలో పోలీసుల పహారా

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 11 లక్షల 44 వేల 645 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.భద్రాచలం కరకట్ట మీద బారికేడ్స్‌ ఏర్పాటు చేశారు. కరకట్ట ప్రాంతంలో పోలీసుల పహారాకొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్, కాలేశ్వరం, మేడిగడ్డ, కడెం నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద 3వ ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి 55 నుంచి 58 అడుగులు గోదావరి వరద వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది..లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.. పర్ణశాలలోని సీత వాగు పొంగడంతో సీతమ్మ వారి నార చీరలు, రాముల వారి రాతి సింహాసనం నీట మునిగాయి. ముంపునకు గురయ్యే గోదావరి నది పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట నుంచి స్లూయిజుల ద్వారా లీకవుతున్న వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో తిరిగి గోదావరి నదిలోకి పంపింగ్ చేస్తున్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్, మణుగూరు, దుమ్మగూడెం, చర్ల,కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story