రోడ్డుపక్కన బంగారు నాణాలు.. ఎగబడుతున్న జనం

చిత్తూరు- తమిళనాడు సరిహద్దులోని హోసూర్ ప్రాంతానికి జనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. రోడ్డు పక్కన మట్టిదిబ్బల్లో బంగారు నాణాలు లభిస్తుండటంతో జనం ఎగబడుతున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలో మట్టిదిబ్బల్లో వందల ఏళ్లనాటి బంగారు నాణాలు బయటపడ్డాయి. దీంతో హోసూర్ - బాగలూర్ రహదారిపై జనం భారీగా తరలివచ్చి బంగారు నాణాలుకోసం వెతకడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు.
మట్టిదిబ్బల్లో లభించిన బంగారు నాణాలు పురాతనమైన స్వచ్చమైన బంగారం అని తేలింది. వాటిపై అరబిక్ లిపిరాసి ఉండటంతో అవి వందల ఏళ్లనాటి నాణాలుగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న హోసూర్ పోలీసులు ఆప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టారు. బంగారు నాణాలు ఎలా వచ్చాయి. అవి నిజమైన పురాతన నాణాలేనా.. లేక ఎవరైనా గుప్తనిధులకోసం తవ్వకాలు చేపట్టి ఇక్కడ పడవేశారా అనేదిదానిపై దర్యాప్తుచేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com