Heat Wave: దంచి కొడుతున్న ఎండలు

Heat Wave: దంచి కొడుతున్న ఎండలు
ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెతిస్తున్నాయి.. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక చేసింది వాతావరణశాఖ.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది..

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు, వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని నెల్లూరు, కావలి, తుని, అనంత పురం, కర్నూలు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమో దయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా 1 పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామీణ మండలాల్లో 43.3, తిరుపతిజిల్లా గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత temparature నమోదైంది.

రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణో గ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావ రణ కేంద్రం ప్రకటించింది. సోమవారం అనకాపల్లి, విజయ నగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముం దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ AP SDMA ఎండీ కూర్మ నాధ్ తెలిపారు. వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకటించారు. సోమవారం 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు Heat waves వీచినట్లు వెల్లడించారు. ఎండలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా.. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు

Tags

Read MoreRead Less
Next Story